అబ్బాయిలకు గెలుపు.. అమ్మాయిలకు ఓటమి
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:04 AM
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో ఆదివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల జట్టు గెలుపొందగా, మహిళల బృందం నిరాశపరిచింది...

భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో ఆదివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల జట్టు గెలుపొందగా, మహిళల బృందం నిరాశపరిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత పురుషుల బృందం 2-0తో స్పెయిన్‌ను చిత్తుచేసింది. జట్టులో రెండు గోల్స్‌ను మన్‌దీప్ (32వ), దిల్‌ప్రీత్ (39) సాధించారు. భారత అమ్మాయిల జట్టు షూటౌట్‌లో 1-2తో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో అనివార్యమైన షూటౌట్‌లో ఇంగ్లండ్ ఫలితం రాబట్టింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..