Share News

US Open 2025 prize money: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేతకు రూ 43 కోట్లు

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:10 AM

టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌ స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. పురుషులు, మహిళల సింగిల్స్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని గతంలో కంటే ఏకంగా 39 శాతానికి పెంచారు....

US Open 2025 prize money: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేతకు రూ 43 కోట్లు

  • భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ

న్యూయార్క్‌: టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌ స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. పురుషులు, మహిళల సింగిల్స్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని గతంలో కంటే ఏకంగా 39 శాతానికి పెంచారు. నిరుడు సింగిల్స్‌ చాంపియన్‌ రూ. 31.57 కోట్లు తీసుకోగా.. ఇకనుంచి విజేతకు రికార్డుస్థాయిలో రూ. 43.86 కోట్లు దక్కనుంది. రన్నరప్‌నకు రూ. 21.93 కోట్లు లభించనుంది. సెమీఫైనలిస్టులు రూ. 11 కోట్లు చొప్పున అందుకోనున్నారు. ఓవరాల్‌ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 745 కోట్లు. 4 గ్రాండ్‌స్లామ్స్‌లో యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీనే అధికం. సింగిల్స్‌ విజేతలకిచ్చే ప్రైజ్‌మనీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రూ. 20 కోట్లు, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రూ. 25 కోట్లు, వింబుల్డన్‌లో రూ. 35 కోట్లుగా ఉంది. యూఎస్‌ ఓపెన్‌ ఈనెల 24న మొదలుకానుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 03:10 AM