తిరుగులేని భారత్
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:27 AM
ఆతిథ్య భారత్ ఖోఖో ప్రపంచ కప్‌లో అప్రతిహత విజయాలతో అదరగొడుతోంది. పురుషులు, మహిళల జట్లు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్లో చోటు దక్కించుకోగా..విజయాలతో గ్రూపు మ్యాచ్‌లను...

ఖోఖో వరల్డ్ కప్
విజయాలతో గ్రూప్ దశ ముగింపు 8 నేడు క్వార్టర్ ఫైనల్స్
పురుషులు శ్రీలంకతో, మహిళలు బంగ్లాదేశ్‌తో ఢీ
న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్ ఖోఖో ప్రపంచ కప్‌లో అప్రతిహత విజయాలతో అదరగొడుతోంది. పురుషులు, మహిళల జట్లు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్లో చోటు దక్కించుకోగా..విజయాలతో గ్రూపు మ్యాచ్‌లను ముగించాయి. గ్రూప్-ఎలో తలపడుతున్న మహిళల జట్టు గురువారం జరిగిన ఆఖరి పోరులో 100-20 పాయింట్ల తేడాతో మలేసియాను చిత్తు చేసింది. ఇరాన్, మలేసియా, దక్షిణ కొరియాతో కూడిన గ్రూప్-ఎలో మన మహిళలు అగ్రస్థానంలో నిలిచారు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో మనోళ్లు తలపడతారు. ఇక..పురుషుల విభాగంలోనూ భారత జట్టు తిరుగులేని ప్రదర్శన చేసింది. గ్రూప్-ఎ చివరి మ్యాచ్‌లో 71-34 పాయింట్ల తేడాతో భూటాన్‌పై గెలుపొందింది. బ్రెజిల్, పెరూ, నేపాల్, భూటాన్‌తో కూడిన గ్రూప్‌లో భారత్ టాప్‌లో నిలిచింది. క్వార్టర్‌ఫైనల్లో శ్రీలంక జట్టును భారత పురుషులు ఎదుర్కొంటారు.