Shubman Gill Fitness Test: గిల్ సంగతేంటి
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:33 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్పిన్ ఉచ్చులో పడిన టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి జరిగే ఆఖరిదైన రెండో టెస్టులో గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది....
ప్రాతినిథ్యంపై అనిశ్చితి.. నేడు ఫిట్‌నెస్ టెస్టు
ఆ తర్వాతే స్పష్టత.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు
గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్పిన్ ఉచ్చులో పడిన టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి జరిగే ఆఖరిదైన రెండో టెస్టులో గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కీలక పోరులో శుభ్‌మన్ గిల్ ఆడతాడా? లేదా? అనే విషయమై టీమ్ మేనేజ్‌మెంట్‌కు స్పష్టత లేదు. ప్రస్తుతం జట్టుతో పాటు గువాహటికి వెళ్లిన గిల్ ప్రాక్టీ్‌సకు దూరంగా ఉన్నాడు. ఈడెన్ టెస్టులో అతను మెడ నొప్పితో బ్యాటింగ్ మధ్యలోనే క్రీజును వీడాల్సి వచ్చింది. గువాహటి టెస్టులో ఆడేదీ లేనిదీ శుక్రవారం గిల్ ఫిట్‌నె్‌సను పరీక్షించాక తేలుతుందని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశాడు. ఏదేమైనా గిల్‌పై అనవసర రిస్క్ తీసుకోవద్దన్న ఆలోచనలో బోర్డు ఉంది.
సాయికే బెర్త్!: కెప్టెన్ గిల్ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీపర్ రిషభ్ పంత్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పనుండగా.. సాయి సుదర్శన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటికే వన్‌డౌన్‌లో సుందర్ మెరుగ్గానే ఆడుతుండడంతో జురెల్‌ను నాలుగు, సాయిని ఆరో నెంబర్‌లో పంపవచ్చు. తుది జట్టులో స్థానం కోసం స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్, పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ మధ్య కూడా పోటీ నెలకొంది. కానీ పిచ్ పరిస్థితిని బట్టి వీరిద్దరిలో ఒకరు రెండో టెస్టులో ఆడనున్నారు. ఎర్ర మట్టితో చేసిన పిచ్ కావడంతో పేస్, బౌన్స్ లభిస్తుంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే.. నితీశ్‌ను తీసుకుంటే ముగ్గురు పేసర్లతో జట్టు ముందుకెళ్లినట్టవుతుంది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి