Share News

యూఏఈ కొత్త చరిత్ర

ABN , Publish Date - May 23 , 2025 | 04:56 AM

బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీ్‌సలో భాగంగా...

యూఏఈ కొత్త చరిత్ర

  • బంగ్లాపై టీ20 సిరీస్‌ విజయం

దుబాయ్‌: బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీ్‌సలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లో యూఏఈ 7 వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించింది. తొలుత బంగ్లా 20 ఓవర్లలో 162/9 స్కోరు చేసింది. జాకర్‌ అలీ (41), తన్జిద్‌ హసన్‌ (40) టాప్‌ స్కోరర్లు. హైదర్‌ అలీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో యూఏఈ 19.1 ఓవర్లలో 166/3 స్కోరు చేసి గెలిచింది. అలీషాన్‌ షరాఫు (68 నాటౌట్‌), ఆసిఫ్‌ ఖాన్‌ (41 నాటౌట్‌) తుదికంటా క్రీజులో నిలిచి జట్టును గెలిపించారు.

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 04:56 AM