తెలంగాణకు రెండు కాంస్యాలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:58 AM
జాతీయ క్రీడలను రెండు కాంస్య పతకాలతో తెలంగాణ ముగించింది. గురువారం జరిగిన షాట్‌గన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మునీక్/రష్మీ ద్వయం కాంస్య పతకం సొంతం చేసుకుంది. నెట్‌బాల్ మిక్స్‌డ్ విభాగంలోనూ...

డెహ్రాడూన్: జాతీయ క్రీడలను రెండు కాంస్య పతకాలతో తెలంగాణ ముగించింది. గురువారం జరిగిన షాట్‌గన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మునీక్/రష్మీ ద్వయం కాంస్య పతకం సొంతం చేసుకుంది. నెట్‌బాల్ మిక్స్‌డ్ విభాగంలోనూ తెలంగాణ జట్టు మూడో స్థానం దక్కించుకుంది. కాంస్య పతక పోరులో తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ 31-31తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ప్రకటించారు. కాగా..గత నెల 28న ప్రారంభమైన జాతీయ క్రీడల్లో పోటీలు గురువారం ముగిశాయి. శుక్రవారం ముగింపు కార్యక్రమం జరుగుతుంది. కాగా పట్టికలో ఆంధ్ర జట్టు 14 (7-1-6) పతకాలతో 18వ స్థానం, తెలంగాణ 18 (3-3-12) పతకాలతో 26వ స్థానంలో నిలిచాయి. ఇక ఓవరాల్‌గా చూస్తే సర్వీసెస్ 121 (68 స్వర్ణ, 26 రజత, 27 కాంస్య) పతకాలతో అగ్ర స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (54 స్వర్ణ, 71 రజత, 73 కాంస్య-198) రెండో స్థానం, హరియాణా (48 స్వర్ణ, 47 రజత, కాంస్య 58-153) మూడో స్థానం సాధించాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..