T20 cricket : వచ్చేసింది..‘ముక్కోణం’
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:55 AM
హోరెత్తుతున్న టీ20 యుగంలో పూర్తిగా మసకబారిన ముక్కోణపు వన్డే సిరీస్‌కు మరోసారి రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ముక్కోణపు సిరీస్ జరుగుతుండడం ఒకింత ప్రా ధాన్యతను

నేటి తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ X న్యూజిలాండ్ ఢీ
ట్రోఫీతో కెప్టెన్లు శాంట్నర్, బవుమా, రిజ్వాన్
మ.2.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
లాహోర్: హోరెత్తుతున్న టీ20 యుగంలో పూర్తిగా మసకబారిన ముక్కోణపు వన్డే సిరీస్‌కు మరోసారి రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ముక్కోణపు సిరీస్ జరుగుతుండడం ఒకింత ప్రా ధాన్యతను సంతరించుకుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తోపాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో తలపడుతున్నా యి. మూడు జట్లు ఒక్కో మ్యాచ్‌లో త లపడతాయి. ఆపై ఫైనల్ ఉంటుంది. ఇక..శనివారం జరిగే ప్రారంభ మ్యాచ్ లో పాకిస్థాన్-న్యూజిలాండ్ ఢీకొంటాయి. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగే వేదికలైన లాహోర్, కరాచీల్లోనే ఈ సిరీస్ కూడా జరగనుంది. ముక్కోణపు సిరీ్‌సకు పాకిస్థాన్, న్యూజిలాండ్ పూర్తిస్థాయి జట్లతో బరిలోకి దిగుతున్నాయి. కానీ ఎస్‌ఏటీ20 లీగ్, గాయాల బెడదతో బలహీనపడిన జట్టుతో సఫారీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో ఏకంగా ఆరుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. పాకిస్థాన్‌కు రిజ్వాన్, న్యూజిలాండ్‌కు శాంట్నర్, దక్షిణాఫ్రికా జట్టుకు బవుమా కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
షెడ్యూల్
ఫిబ్రవరి 8: పాకిస్థాన్Xన్యూజిలాండ్, మ.2.30 నుంచి
ఫిబ్రవరి 10: న్యూజిలాండ్Xదక్షిణాఫ్రికా, ఉ.10 నుంచి
ఫిబ్రవరి 12: పాకిస్థాన్Xదక్షిణాఫ్రికా, మ.2.30 నుంచి
ఫిబ్రవరి 14: ఫైనల్. మ.2.30 నుంచి