Share News

ఒకే పార్శ్వంలో జొకో సిన్నర్‌

ABN , Publish Date - May 23 , 2025 | 05:01 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాజీ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు కఠినమైన డ్రా ఎదురైంది. వరల్డ్‌ నెం:1 జానిక్‌ సిన్నర్‌, గతేడాది రన్నరప్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, జొకోవిచ్‌ ఒక పార్శ్వంలో...

ఒకే పార్శ్వంలో జొకో సిన్నర్‌

25 నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాజీ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు కఠినమైన డ్రా ఎదురైంది. వరల్డ్‌ నెం:1 జానిక్‌ సిన్నర్‌, గతేడాది రన్నరప్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, జొకోవిచ్‌ ఒక పార్శ్వంలో తలపడనున్నారు. గురువారం సింగిల్స్‌ మెయిన్‌ డ్రాను నిర్వాహకులు విడుదల చేశారు. డిఫెండింగ్‌ చాంప్‌, వరల్డ్‌ నెం:2 కార్లోస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్‌లో నిషికొరితో, అమెరికా ఆటగాడు మెకెంజీ మెక్‌డొనాల్డ్‌తో జొకోవిచ్‌ తలపడనున్నారు. జొకో ముందంజ వేస్తే క్వార్టర్స్‌లో జ్వెరెవ్‌.. అదీ దాటితే సెమీస్‌లో సిన్నర్‌తో అమీతుమీ తేల్చుకోవాల్సి రావచ్చు. మహిళల డ్రాలో డిఫెండింగ్‌ చాంప్‌ ఇగా స్వియటెక్‌ తొలి రౌండ్‌లో రెబెక్కా స్రమ్‌కొవాతో తలపడనుంది. అయితే, క్వార్టర్స్‌ చేరితే గతేడాది రన్నరప్‌ పౌలినీతో స్వియటెక్‌ ఆడే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 05:03 AM