Share News

Zonal Format Cricket: తిలక్‌కు సౌత్‌జోన్‌ పగ్గాలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:18 AM

దులీప్‌ ట్రోఫీలో సౌత్‌జోన్‌ కెప్టెన్‌గా హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ నియమితుడయ్యాడు. అతడితోపాటు తెలుగు ఆటగాళ్లు తన్మయ్‌ అగర్వాల్‌, తనయ్‌ త్యాగరాజన్‌, రికీ భుయ్‌, టి. విజయ్‌, షేక్‌ రషీద్‌ కూడా...

Zonal Format Cricket: తిలక్‌కు సౌత్‌జోన్‌ పగ్గాలు

మళ్లీ జోనల్‌ ఫార్మాట్‌లో దులీప్‌ ట్రోఫీ

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీలో సౌత్‌జోన్‌ కెప్టెన్‌గా హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ నియమితుడయ్యాడు. అతడితోపాటు తెలుగు ఆటగాళ్లు తన్మయ్‌ అగర్వాల్‌, తనయ్‌ త్యాగరాజన్‌, రికీ భుయ్‌, టి. విజయ్‌, షేక్‌ రషీద్‌ కూడా ఎంపికయ్యారు. కర్ణాటక క్రీడాకారులు వైశాక్‌ విజయ్‌ కుమార్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, స్మరణ్‌కు కూడా టీమ్‌లో చోటుదక్కింది. దులీప్‌ ట్రోఫీని మళ్లీ జోనల్‌ ఫార్మాట్‌కు మార్చిన సంగతి తెలిసిందే. గతేడాది భారత్‌ ఎ,బి,సి,డి జట్లుగా విభజించి నిర్వహించారు. కానీ, ఈసారి జోనల్‌ సెలెక్టర్లు ఆరు జట్లను ఎంపిక చేశారు. వచ్చే నెల 28 నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే

క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..

Read Latest and Business News

Updated Date - Jul 28 , 2025 | 02:18 AM