Share News

Telugu Titans Lose: తలైవాస్‌ శుభారంభం

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:41 AM

సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌ పీకేఎల్‌ను విజయంతో ప్రారంభించాలనుకున్న తెలుగు టైటాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం మొదలైన..

Telugu Titans Lose: తలైవాస్‌ శుభారంభం

  • తెలుగు టైటాన్స్‌ ఓటమి

  • ప్రొ కబడ్డీ లీగ్‌

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)ను విజయంతో ప్రారంభించాలనుకున్న తెలుగు టైటాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం మొదలైన లీగ్‌లో టైటాన్స్‌ జట్టుకు తమిళ్‌ తలైవాస్‌ ఝలకిచ్చింది. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో తలైవాస్‌ 38-35 స్కోరుతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. స్టార్‌ రైడర్‌ అర్జున్‌ దేశ్వాల్‌ సూపర్‌ 10, కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ 9 పాయింట్లు స్కోరు చేసి తలైవాస్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, ఆతిథ్య టైటాన్స్‌ జట్టు తరఫున భరత్‌ హుడా తొమ్మిది పాయింట్లతో రాణించాడు. అనంతరం పుణెరి పల్టన్‌, బెంగళూరు బుల్స్‌ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత 32-32తో స్కోర్లు సమమయ్యాయి. దీంతో ఫలితం కోసం నిర్వహించిన టైబ్రేకర్‌లో పుణెరి జట్టు 6-4తో విజయం సాధించింది. అంతకుముందు.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరై లీగ్‌ను ప్రారంభించారు. ఆరంభ వేడుకల్లో హాకీ మాజీ కెప్టెన్‌ ధన్‌రాజ్‌ పిళ్లే, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ, అంతర్జాతీయ అథ్లెట్‌ యర్రాజీ జ్యోతి, కబడ్డీ దిగ్గజం పర్దీప్‌ నర్వాల్‌, పారాలింపిక్స్‌ పతక విజేత యోగేష్‌ కథూనియా పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:41 AM