Share News

Deaflympics 2025: మన ధనుష్‌ బంగారం

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:46 AM

మాట్లాడలేకపోవడం, వినికిడిలోపం తన దృష్టిలో వైకల్యాలే కావంటూ.. బరిలోకి దిగితే పతకం సాధించడమే తన లక్ష్యం అని మరోసారి చాటిచెప్పాడు తెలుగు బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌. ఈ హైదరాబాద్‌ కుర్రాడు...

Deaflympics 2025: మన ధనుష్‌ బంగారం

బధిర ఒలింపిక్స్‌లో

తెలుగు షూటర్‌కు ‘రికార్డు’ పసిడి

న్యూఢిల్లీ: మాట్లాడలేకపోవడం, వినికిడిలోపం తన దృష్టిలో వైకల్యాలే కావంటూ.. బరిలోకి దిగితే పతకం సాధించడమే తన లక్ష్యం అని మరోసారి చాటిచెప్పాడు తెలుగు బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌. ఈ హైదరాబాద్‌ కుర్రాడు ప్రతిష్టాత్మక డెఫ్లింక్స్‌లో (బధిర అథ్లెట్లు పోటీపడే ఒలింపిక్స్‌) స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. అది కూడా.. ప్రపంచ రికార్డు ప్రదర్శనతో చాంపియన్‌గా నిలవడం విశేషం. టోక్యోలో ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌ ఫైనల్లో ధనుష్‌ 252.2తో ప్రపంచ రికార్డు స్కోరు చేసి పసిడి దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన ముర్తజా వానియా 250.1 స్కోరుతో రజతం సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌ చేరే క్రమంలో క్వాలిఫికేషన్స్‌లో శ్రీకాంత్‌ 630.6 స్కోరుతో డెఫ్లింక్స్‌ రికార్డును నమోదుచేశాడు. 23 ఏళ్ల ధను్‌షకు ఇది డెఫ్లింక్స్‌లో మూడో స్వర్ణం. 2022 బ్రెజిల్‌లో జరిగిన డెఫ్లింక్స్‌లో అతడు రెండు పసిడి పతకాలు గెలుచుకున్నాడు. ఇక, తాజా డెఫ్లింక్స్‌లో మరో ఇద్దరు భారత షూటర్లు పతకాలు నెగ్గారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో మహిత్‌ సంధు (250.5) రజతం, వాఘ్‌మారె (228.3) కాంస్యం సాధించారు. ఉక్రెయిన్‌ షూటర్‌ విళీయొ లిటా (252.4) స్వర్ణం గెలిచింది. 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో పసిడి అందుకున్న ధనుష్‌ శ్రీకాంత్‌.. సోమవారం జరిగే ఇదే ఈవెంట్‌ మిక్స్‌డ్‌ విభాగంలో మహిత్‌ సంధుతో కలిసి బరిలోకి దిగనున్నాడు.


రూ. 1.20 కోట్లు నజరానా ప్రకటించిన

రాష్ట్ర సర్కారు

హన్మకొండ: డెఫ్లింక్స్‌లో స్వర్ణం గెలిచిన ధనుష్‌ శ్రీకాంత్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో అమలవుతున్న క్రీడా విధానం ప్రకారం డెఫ్లింక్స్‌లో స్వర్ణం అందుకున్న శ్రీకాంత్‌కు రూ. 1.20 కోట్లు ప్రోత్సాహక బహుమతి కింద ఇవ్వనున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఆదివారం ఇక్కడ జరిగిన కొత్త స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి శ్రీహరి.. ఈ రివార్డు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 06:46 AM