Share News

Tata Steel Chess : అర్జున్‌పై ప్రజ్ఞానంద గెలుపు

ABN , Publish Date - Jan 21 , 2025 | 07:16 AM

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసికి మూడో రౌండ్లో చుక్కెదురైంది. సోమవారం జరిగిన గేమ్‌లో అర్జున్‌ను భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద ఓడించాడు. ఇక, ప్రపంచ చాంపియన్‌

Tata Steel Chess : అర్జున్‌పై ప్రజ్ఞానంద గెలుపు

వికాన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసికి మూడో రౌండ్లో చుక్కెదురైంది. సోమవారం జరిగిన గేమ్‌లో అర్జున్‌ను భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద ఓడించాడు. ఇక, ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌, పెంటేల హరికృష్ణకు డ్రాలు ఎదురయ్యాయి. మూడో రౌండ్‌లో ఫాబియానో కరువానా (అమెరికా)తో గుకేష్‌, భారత్‌కే చెందిన లియాన్‌ లూక్‌ మెండోన్కాతో హరి గేమ్‌లు డ్రా చేసుకున్నారు. ఇక, అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో వ్లాదిమిర్‌ ఫెడోసివ్‌ (రష్యా), కీమెర్‌ విన్సెంట్‌ (పోలెండ్‌)తో వీ ఈ (చైనా) గేమ్‌లు కూడా డ్రాగా ముగిశాయి. మూడు రౌండ్ల అనంతరం ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

Updated Date - Jan 21 , 2025 | 07:16 AM