హర్షప్రదకు రజతం
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:58 AM
తెలంగాణకు 38వ జాతీయ క్రీడల్లో తొలి రజత పతకం లభించింది. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం ముగిసిన తైక్వాండో 73 కిలోల కియోర్గి విభాగం ఫైనల్లో

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణకు 38వ జాతీయ క్రీడల్లో తొలి రజత పతకం లభించింది. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం ముగిసిన తైక్వాండో 73 కిలోల కియోర్గి విభాగం ఫైనల్లో చండీగఢ్ అమ్మాయి ఇతీషా దాస్ 2-0తో తెలంగాణ ప్లేయర్ హర్షప్రదను ఓడించింది. హర్షప్రదను తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు డి.సతీష్ గౌడ్ అభినందించారు. పతకాల పట్టికలో తెలంగాణ ప్రస్తుతం ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలతో 28వ స్థానంలో ఉంది.