Share News

తేజస్వినికి స్వర్ణం

ABN , Publish Date - May 27 , 2025 | 02:21 AM

ఐఎ్‌సఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో హరియాణా షూటర్‌ తేజస్విని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో...

తేజస్వినికి స్వర్ణం

సుహ్ల్‌ (జర్మనీ): ఐఎ్‌సఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో హరియాణా షూటర్‌ తేజస్విని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో 31 పాయింట్లు సాధించిన తేజస్విని ప్రథమ స్థానంలో నిలిచింది. అలీనా నెస్ట్‌యారోవిచ్‌ (తటస్థ అథ్లెట్‌) రజతం, మిరియం (హంగేరి) కాంస్యం సాధించారు. ఈ పోటీల్లో భారత్‌కిది మూడో స్వర్ణం కాగా.. మొత్తంగా 11వ పతకం. ఈ మెడల్‌తో చైనాను వెనక్కి నెట్టి వరల్డ్‌కప్‌ పతకాల పట్టికలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:21 AM