Team India Sweats in Nets: నెట్స్‌లో చెమటోడ్చిన టీమిండియా
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:44 AM
ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్.. స్వదేశానికి చేరుకొన్న వెంటనే వెస్టిండీ్‌సతో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రాక్టీస్ ఆరంభించింది. మంగళవారం జరిగిన నెట్ సెషన్స్ నుంచి బుమ్రా, కుల్దీప్, అక్షర్ విరామం తీసుకోగా...
అహ్మదాబాద్: ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్.. స్వదేశానికి చేరుకొన్న వెంటనే వెస్టిండీ్‌సతో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రాక్టీస్ ఆరంభించింది. మంగళవారం జరిగిన నెట్ సెషన్స్ నుంచి బుమ్రా, కుల్దీప్, అక్షర్ విరామం తీసుకోగా.. మిగతా టీమ్ మూడు గంటలు సాధన చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌పలో భాగంగా విండీ్‌సతో తొలి టెస్ట్ గురువారం నుంచి జరగనుంది. ప్రాక్టీస్ తర్వాత గంభీర్ మరోసారి పిచ్‌ను పరిశీలించాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో చిత్తయిన నేపథ్యంలో తొలి టెస్ట్ కోసం ఎలాంటి పిచ్‌ను రూపొందించారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో భారత బలానికి తగ్గట్టుగా స్పిన్ వికెట్‌ను తయారు చేసేవారు. మరి గిల్ హయాంలో పాత ఫార్ములాకే కట్టుబడతారా? లేక ప్రయోగాలు చేస్తారా? చూడాలి.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం