India vs Australia: బ్యాటర్లు చెలరేగాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:46 AM
పేసర్ హాజెల్‌వుడ్ బౌన్స్‌తో బెంబేలెత్తించడంతో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు...
మధ్యాహ్నం 1.45 నుంచి..
ఆస్ట్రేలియాతో భారత్ మూడో టీ20 నేడు
హాజెల్‌వుడ్‌కు విశ్రాంతి
హోబర్ట్: పేసర్ హాజెల్‌వుడ్ బౌన్స్‌తో బెంబేలెత్తించడంతో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే త్వరలో యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆసీస్ జట్టు.. టీమిండియాతో జరిగే మిగిలిన మూడు టీ20ల నుంచి హాజెల్‌వుడ్‌కు విశ్రాంతి ఇచ్చింది. మరి.. దీనిని సద్వినియోగం చేసుకొని సూర్యకుమార్ బృందం.. ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌లో చెలరేగుతారేమో చూడాలి. మరోవైపు ఎడమ చేతి పేసర్ అర్ష్‌దీ్‌పకు జట్టులో చోటు కల్పించక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. పేసర్లకు అనుకూలించే మెల్‌బోర్న్ పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడడాన్ని విశ్లేషకులు తప్పుబట్టారు. మూడో మ్యాచ్ వేదిక బెల్లరీవ్ ఓవల్ పిచ్ స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. దాంతో ఒక స్పిన్నర్‌ను తప్పించి పేసర్‌ను తుది జట్టులో తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News