Share News

ఇంగ్లండ్‌ చేరిన టీమిండియా

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:25 AM

కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో భారత జట్టు సుదీర్ఘ పర్యటనకోసం ఇంగ్లండ్‌ గడ్డపై కాలు మోపింది. 2025-27 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా...

ఇంగ్లండ్‌ చేరిన టీమిండియా

లండన్‌: కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో భారత జట్టు సుదీర్ఘ పర్యటనకోసం ఇంగ్లండ్‌ గడ్డపై కాలు మోపింది. 2025-27 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఈ సిరీ్‌సలో ఆతిథ్య జట్టుతో టీమిండియా ఐదు టెస్ట్‌లలో తలపడనుంది. శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన భారత్‌ శనివారం ఇక్కడకు చేరుకుంది. గిల్‌తోపాటు వైస్‌-కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌, పేసర్లు జస్ర్పీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆల్‌రౌండర్‌ జడేజా తదితరులు ఈ బృందంలో ఉన్నారు. టెస్ట్‌ జట్టులోని ఇతర క్రికెటర్లు ఇండియా ‘ఎ’ పర్యటనలో భాగంగా ఇప్పటికే యూకేలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై బీసీసీఐ సీరియస్!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 04:25 AM