Share News

అర్జున్‌, హరికృష్ణకు డ్రా

ABN , Publish Date - Jan 23 , 2025 | 05:04 AM

టాటా స్టీల్‌ చెస్‌ మాస్టర్స్‌ విభాగం ఐదో రౌండ్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్లు అర్జున్‌ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ డ్రాగా ముగించారు...

అర్జున్‌, హరికృష్ణకు డ్రా

వికాన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ మాస్టర్స్‌ విభాగం ఐదో రౌండ్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్లు అర్జున్‌ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ డ్రాగా ముగించారు. సహచర గ్రాండ్‌మాస్టర్‌ మెన్డోన్కాతో బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో అర్జున్‌ 30 ఎత్తుల తర్వాత పాయింట్‌ను పంచుకున్నాడు. వీ ఈ(చైనా)తో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 22 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. చాలెంజర్స్‌ విభాగంలో ఫ్రెడ్రిక్‌ (జర్మనీ)తో ఐదో రౌండ్‌ను వైశాలీ డ్రా చేసుకుంది.

Updated Date - Jan 23 , 2025 | 05:04 AM