Share News

Tai Tzu Ying Badminton Retirement: బ్యాడ్మింటన్‌కు తైజు గుడ్‌బై

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:25 AM

తైపీకి చెందిన ప్రఖ్యాత షట్లర్‌ తైజు యింగ్‌ బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పింది. తిరగబెడుతున్న గాయాలవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు 31 ఏళ్ల ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ తైజు శనివారం వెల్లడించింది...

Tai Tzu Ying Badminton Retirement: బ్యాడ్మింటన్‌కు తైజు గుడ్‌బై

15 ఏళ్ల కెరీర్‌లో 17 టైటిళ్లు

సింధుతో మరపురాని మ్యాచ్‌లెన్నో..

న్యూఢిల్లీ: తైపీకి చెందిన ప్రఖ్యాత షట్లర్‌ తైజు యింగ్‌ బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పింది. తిరగబెడుతున్న గాయాలవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు 31 ఏళ్ల ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ తైజు శనివారం వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత అయిన తైజు.. తన 15 ఏళ్ల కెరీర్‌లో 17 బీడబ్ల్యూఎఫ్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది. మరో 12 ఈవెంట్లలో రన్నర్‌పగా నిలిచింది. 2024లో ఇండియా ఓపెన్‌తో చివరి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ అందుకుంది.

నా పయనంలో నిన్ను కోల్పోతున్నా: సింధు

సమకాలీన బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ పీవీ సింధు, తైజు చిరకాల ప్రత్యర్థులు. వీరిద్దరి మ్యాచ్‌ అంటే బ్యాడ్మింటన్‌ ప్రియులకు పసందైన విందు. ఆఖరి ర్యాలీ వరకూ ఉత్కంఠగా సాగిన వీరి మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టాయి. అలాంటి తైజు ఆటకు వీడ్కోలు పలకడంతో సింధు భావోద్వేగానికి లోనైంది. ‘15 ఏళ్లుగా నీతో తలపడిన ప్రతి మ్యాచ్‌ మరపురానిదే. ఆ మ్యాచ్‌ల నుంచి ఓ అథ్లెట్‌గా ఎంతో మెరుగయ్యా’ అని సింధు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

2028 Olympics: భారత్‌, పాక్‌ పోరు లేనట్లేనా..?

ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 06:25 AM