Share News

స్వియటెక్‌కు షాక్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:32 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఈసారి నయా చాంపియన్‌ రానుంది. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ఫైనల్‌కు చేరిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఎరీనా సబలెంక-రెండో సీడ్‌ కొకో గాఫ్‌ శనివారం టైటిల్‌ కోసం...

స్వియటెక్‌కు షాక్‌

26 వరుస విజయాలకు బ్రేక్‌

  • ఫైనల్లో సబలెంక 8 గాఫ్‌తో అమీతుమీ

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఈసారి నయా చాంపియన్‌ రానుంది. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ఫైనల్‌కు చేరిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఎరీనా సబలెంక-రెండో సీడ్‌ కొకో గాఫ్‌ శనివారం టైటిల్‌ కోసం తలపడనున్నారు. అటు వరుసగా మూడుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చాంపి యన్‌గా నిలుస్తూ వస్తోన్న ఐదో సీడ్‌ ఇగా స్వియటెక్‌కు చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఎరీనా సబలెంక (బెలారస్‌) 7-6 (7-1), 4-6, 6-0 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే రొలాండ్‌ గారోస్‌లో స్వియటెక్‌ 26 వరుస విజయాలకు కూడా ఈ ఓటమితో బ్రేక్‌ పడినట్టయ్యింది. 2020లో తొలిసారి ఇక్కడ విజేతగా నిలిచిన స్వియటెక్‌ ఆ తర్వాత 2022, 2023, 2024లోనూ గ్రాండ్‌స్లామ్‌ అందు కుంది. పైగా క్లే కోర్టుల్లో సబలెంకపై 5-1తో ఆధిక్యంలో ఉండడంతో ఈ మ్యాచ్‌ ఫలితంపై ఆసక్తి ఏర్పడింది.


గాఫ్‌ అలవోకగా..: వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌ లూయిస్‌ బోయిసన్‌ సంచలన ప్రదర్శన ముగిసింది. రెండో సీడ్‌ కొకో గాఫ్‌ (యూఎస్‌ఏ) 6-1, 6-2 తేడాతో బోయిసన్‌పై సునాయాసంగా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 361వ ర్యాంకర్‌ బోయిసన్‌ మేటి క్రీడా కారిణులను మట్టి కరిపిస్తూ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌కు చేరింది. అయితే గాఫ్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.

జ్వెరెవ్‌ను ఓడించి జొకో: పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ జొకోవిచ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ పోరులో తను జ్వెరెవ్‌ (జర్మనీ)పై 4-6, 6-3, 6-2, 6-4 తేడాతో నెగ్గాడు. దీంతో శుక్రవారం జరిగే సెమీస్‌లో సిన్నర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.


ఇవీ చదవండి:

బెంగళూరు విషాదంపై సచిన్ రియాక్షన్

మాల్యా గాలి తీసిన ఎస్‌బీఐ!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 04:32 AM