స్వియటెక్ సులువుగా
ABN , Publish Date - May 27 , 2025 | 02:26 AM
డిఫెండింగ్ చాంపియన్స్ ఇగా స్వియటెక్, కార్లోస్ అల్కారజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల తొలి రౌండ్‌లో ఐదో సీడ్ స్వియటెక్ 6-3, 6-3తో రెబెక్కా స్కమ్‌కోవాను ఓడించింది. గంటా 24 నిమిషాల పాటు...
రెండో రౌండ్‌లో ప్రవేశం
అల్కారజ్ కూడా..
టేలర్ ఫ్రిట్జ్‌కు షాక్
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్స్ ఇగా స్వియటెక్, కార్లోస్ అల్కారజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల తొలి రౌండ్‌లో ఐదో సీడ్ స్వియటెక్ 6-3, 6-3తో రెబెక్కా స్కమ్‌కోవాను ఓడించింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్వియటెక్ 25 విన్నర్లు సంధించగా, నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసింది. ఇక గతేడాది యూఎస్ ఓపెన్ సెమీ్‌సకు చేరిన తొమ్మిదో సీడ్ ఎమ్మా నవర్రో 0-6, 1-6తో అన్‌సీడెడ్ బౌజాస్ చేతిలో, నవోమి ఒసాక 7-6, 1-6, 4-6తో పాలా బడోసా చేతిలో ఓడారు. అలాగే ఎమ్మా రడుకాను, ఎలెనా రిబకినా తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల విభాగంలో రెండో సీడ్, స్పెయిన్ స్టార్ అల్కారజ్ 6-3, 6-4, 6-2తో జెప్పిరిపై గెలిచాడు. ఏడో సీడ్ కాస్పర్ రూడ్ 6-3, 6-4, 6-2తో ఆల్బర్ట్ రామోస్‌పై నెగ్గాడు. అయితే ప్రపంచ నాలుగో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ తొలి రౌండ్‌లోనే కంగుతిన్నాడు. జర్మనీ ఆటగాడు డానియెల్ అల్ట్‌మెర్ 7-5, 3-6, 6-3, 6-1తో అతడిపై గెలిచాడు. మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా 6-7, 3-6, 2-6తో జేకబ్ ఫెన్లీ చేతిలో ఓడాడు. 20వ సీడ్ సిట్సిపాస్ 7-5, 6-3, 6-4తో టోమస్‌పై నెగ్గి రెండో రౌండ్ చేరారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి