Share News

Elina Svitolina Online Abuse: స్విటోలినాను చంపేయాలి

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:03 AM

ఓ మ్యాచ్‌లో ఓడడంతో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ ఎలెనా స్విటోలినా ఆన్‌లైన్‌ వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మాంట్రియల్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో నవోమి ఒసాక చేతిలో వరల్డ్‌ నెం.13 స్విటోలినా...

Elina Svitolina Online Abuse: స్విటోలినాను చంపేయాలి

బెట్టింగ్‌ రాయుళ్ల ఆన్‌లైన్‌ వేధింపులు

మాంట్రియల్‌: ఓ మ్యాచ్‌లో ఓడడంతో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ ఎలెనా స్విటోలినా ఆన్‌లైన్‌ వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మాంట్రియల్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో నవోమి ఒసాక చేతిలో వరల్డ్‌ నెం.13 స్విటోలినా 2-6, 2-6తో ఓడింది. దీంతో గ్యాంబ్లర్లు.. ఆన్‌లైన్‌లో ఆమెను కించపరిచే సందేశాలు పంపారు. ఆమెను రష్యా చంపేయాలని కోరుకొంటున్నట్టు ఓ బెట్టింగ్‌ రాయుడు రాశాడు. అంతేకాకుండా స్విటోలినా భర్త, నల్లజాతీయుడైన గేల్‌ మోన్‌ఫిల్స్‌ను ఉద్దేశించి జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఆయా స్ర్కీన్‌షాట్లను షేర్‌ చేసిన స్విటోలినా.. ఇన్‌స్టాలో ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘ఓ మహిళ.. అందునా అమ్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుగా లేదా? మీ అమ్మే ఈ మెసేజ్‌లను చూస్తే తప్పకుండా అసహ్యించుకొంటుంద’ని పేర్కొంది. స్విటోలినా ఓడిపోవడంతో ఆమెపై బెట్టింగ్‌ పెట్టిన వ్యక్తులు అసహనంతో ఈ మెసేజ్‌లు చేసినట్టు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 03:03 AM