World Para Athletics: సుమీత్ హ్యాట్రిక్
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:50 AM
వరల్డ్ పారా అథ్లెటిక్స్ జావెలిన్ త్రోలో ఫేవరెట్ సుమీత్ అంటిల్ వరుసగా మూడో పసిడి సాధించగా.. ఎఫ్-44 విభాగంలో సందీప్ సంజయ్ సాగర్, సందీప్ చౌధురి స్వర్ణ, రజతాలు కొల్లగొట్టారు...
ప్రపంచ పారా అథ్లెటిక్స్
సందీ్‌పకు స్వర్ణం
ఫైనల్‌కు అకీరా
న్యూఢిల్లీ: వరల్డ్ పారా అథ్లెటిక్స్ జావెలిన్ త్రోలో ఫేవరెట్ సుమీత్ అంటిల్ వరుసగా మూడో పసిడి సాధించగా.. ఎఫ్-44 విభాగంలో సందీప్ సంజయ్ సాగర్, సందీప్ చౌధురి స్వర్ణ, రజతాలు కొల్లగొట్టారు. మంగళవారం జరిగిన పురుషుల ఎఫ్-64 ఫైనల్లో సుమీత్ 71.37 మీ. దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. 2023, 2024లో కూడా అంటిల్ పసిడి పతకాలు నెగ్గాడు. పురుషుల ఎఫ్-44 కేటగిరీలో సందీప్ సాగర్ 62.82 మీటర్లు విసిరి టాప్‌లో నిలిచాడు. చౌధురి 62.67 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకొన్నాడు. పురుషుల ఎఫ్-56 డిస్కస్ త్రోలో యోగేష్ కథూనియా 42.49 మీ. దూరం విసిరి రజతం సాధించాడు. కాగా, తెలంగాణకు చెందిన బానోతు అకీరా నందన్ పురుషుల 400 మీ. టీ38 కేటగిరి హీట్-1లో 50.55 సెకన్ల టైమింగ్‌తో ఫైనల్‌కు అర్హత సాధించాడు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం