Steve Smith : స్మిత్ @ 36
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:56 AM
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (120 బ్యాటింగ్) టెస్టుల్లో 36వ శతకం పూర్తి చేశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో ఎక్కువ సెంచరీలు బాదిన జాబితాలో ద్రవిడ్, రూట్‌లతో కలిసి ఐదో స్థానంలో నిలిచాడు. సచిన్ (51)

స్టీవ్, క్యారీ శతకాలు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 330/3
గాలె: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (120 బ్యాటింగ్) టెస్టుల్లో 36వ శతకం పూర్తి చేశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో ఎక్కువ సెంచరీలు బాదిన జాబితాలో ద్రవిడ్, రూట్‌లతో కలిసి ఐదో స్థానంలో నిలిచాడు. సచిన్ (51) టాప్‌లో ఉన్నాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో కలిపి స్మిత్‌కిది 48వ శతకం కాగా.. ఇందులో ద్రవిడ్, రోహిత్ సరసన నిలిచాడు. ఇక శ్రీలంకతో జరుగుతున్న ఈ రెండో టెస్టులో స్మిత్‌కు జతగా క్యారీ (139 బ్యాటింగ్) కూడా అజేయ శతకం బాదడంతో రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 330/3 స్కోరుతో నిలిచింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది.