Share News

Australian Open : స్టార్లు సాఫీగా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:10 AM

ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్టార్‌ ఆటగాళ్లు అంచనాలను అందుకొంటూ ముందంజ వేస్తున్నారు. పురుషుల్లో..11వ టైటిల్‌పై కన్నేసిన దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత కార్లోస్‌ అల్కారజ్‌, రెండో సీడ్‌

 Australian Open : స్టార్లు సాఫీగా..

’ప్రీక్వార్టర్స్‌లో జొకో,

అల్కారజ్‌, సబలెంకా, గాఫ్‌

ఏడో సీడ్‌ పెగులాకు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్టార్‌ ఆటగాళ్లు అంచనాలను అందుకొంటూ ముందంజ వేస్తున్నారు. పురుషుల్లో..11వ టైటిల్‌పై కన్నేసిన దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత కార్లోస్‌ అల్కారజ్‌, రెండో సీడ్‌ జ్వెరేవ్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. మహిళల డిఫెండింగ్‌ చాంప్‌ అర్యానా సబలెంకా, మూడో సీడ్‌ కొకొ గాఫ్‌ నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. అయితే మెల్‌బోర్న్‌ పార్క్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన నవోమి ఒసాకా గాయంతో మూడో రౌండ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలగింది. గత ఏడాది సెమీఫైనలిస్ట్‌ గాఫ్‌ 6-4, 6-2తో 2021 లెలా ఫెర్నాండెజ్‌ని చిత్తు చేసింది. టాప్‌ సీడ్‌ సబలెంకా కూడా 7-6 (5), 6-4తో క్లారా టాసన్‌పై గెలిచింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌లలో 11వ సీడ్‌ పౌలా బడోసా 6-4, 4-6, 6-3తో 17వ సీడ్‌ కోస్ట్యుక్‌ని, 14వ సీడ్‌ ఆండ్రీవా 6-2, 1-6, 6-2తో 23వ సీడ్‌ ఫ్రెచ్‌ని ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరారు. కాగా, 23 ఏళ్ల ఓల్గా డానిలోవిచ్‌ 7-6 (3), 6-1తో ఏడో సీడ్‌, యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ పెగులాపై సంచలన విజయం సాధించింది. 12వ సీడ్‌ ష్నీడెర్‌కు 7-6 (4), 6-7 (7), 7-5తో 18వ సీడ్‌ వెకిక్‌ షాకిచ్చింది. పురుషుల మూడో రౌండ్‌లో ఏడో సీడ్‌ జొకోవిచ్‌ 6-1, 6-4, 6-4తో టోమస్‌ మకాక్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. జ్వెరేవ్‌ 6-3, 6-4, 6-4తో ఫెర్న్‌లీపై, మూడో సీడ్‌ అల్కారజ్‌ 6-2, 6-4, 6-7 (7), 6-2తో బోర్గె్‌సపై, 12వ సీడ్‌ టామీ పాల్‌ 7-6 (0), 6-2, 6-0తో కార్బలెస్‌పై విజయంతో నాలుగో రౌండ్‌లో అడుగు పెట్టారు. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న/షుయ్‌ జాంగ్‌ (చైనా) ద్వయం 6-4, 6-4తో డోడిగ్‌/క్రిస్టియానాపై నెగ్గి రెండోరౌండ్‌లో ప్రవేశించింది.

Updated Date - Jan 18 , 2025 | 05:10 AM