Share News

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

ABN , Publish Date - May 23 , 2025 | 05:08 AM

మలేసియా మాస్టర్స్‌లో భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో ...

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

  • కపిల-తనీష జోడీ కూడా

  • మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌లో భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 23-21, 21-17తో ఎన్‌గుయన్‌ (ఐర్లాండ్‌)పై చెమటోడ్చి గెలిచాడు. ప్రణయ్‌ 9-21, 18-21తో యుషి తనాక (జపాన్‌) చేతిలో, సతీష్‌ కుమార్‌ కరుణాకరన్‌ 14-21, 16-21తో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో 21-17, 18-21, 21-15తో ఫ్రాన్స్‌కు చెందిన జూలియన్‌ మయో-లి పలెర్మోపై గెలిచి ముందంజ వేసింది. మహిళల డబుల్స్‌లో ప్రేరణ అల్వేకర్‌-మృణ్మయి దేశ్‌పాండే జంట 9-21, 14-21తో హసు హుయ్‌-లిన్‌ జి యున్‌ చేతిలో ఓడింది.

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 05:08 AM