శ్రీహరి 86వ గ్రాండ్‌మాస్టర్
ABN , Publish Date - May 16 , 2025 | 05:43 AM
తమిళనాడుకు చెందిన ఎల్. ఆర్.శ్రీహరి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన 86వ భారత్ ఆటగాడిగా నిలిచాడు. గత ఏడాది మేలో జరిగిన దుబాయ్ ఓపెన్‌లో 2500 ఎలో రేటింగ్ సాధించిన 19 ఏళ్ల శ్రీహరి...
చెన్నై: తమిళనాడుకు చెందిన ఎల్. ఆర్.శ్రీహరి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన 86వ భారత్ ఆటగాడిగా నిలిచాడు. గత ఏడాది మేలో జరిగిన దుబాయ్ ఓపెన్‌లో 2500 ఎలో రేటింగ్ సాధించిన 19 ఏళ్ల శ్రీహరి..అంతకుముందు బుడాపెస్ట్ టోర్నీలో తొలి జీఎం నార్మ్, తర్వాత ఖతార్ మాస్టర్స్ చాంపియన్‌షి్‌పలో రెండో జీఎం నార్మ్ సొంతం చేసుకున్నాడు. ఇక..ప్రస్తుతం అబుధాబిలో జరుగుతున్న ఆసియా వ్యక్తిగత చెస్ టోర్నమెంట్‌లో అతడు తుది జీఎం నార్మ్ సాధించాడు. దాంతో శ్రీహరికి ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌మాస్టర్ టైటిల్ లభించింది.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి