లంకకు ఇన్నింగ్స్ పరాజయం
ABN , Publish Date - Feb 02 , 2025 | 02:25 AM
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలిచింది. లంక టెస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం...
గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలిచింది. లంక టెస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. నాలుగో రోజైన శనివారం 136/5 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక 165 రన్స్‌కే కుప్పకూలింది. చాందిమల్ (72) రాణించాడు. స్పిన్నర్ కునేమన్ 5 వికెట్లతో దెబ్బతీశాడు. 489 పరుగుల లోటుతో ఫాలోఆన్‌కు దిగిన లంక 247 రన్స్‌కే పరిమితమైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 654/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.