Ind A Vs UAE: ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ.. విజృంభించిన భారత్.. యూఏఈ లక్ష్యం ఎంతంటే..
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:24 PM
యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ టీమ్ భారీ స్కోరు సాధించింది. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ విజృంభించడంతో ప్రత్యర్థికి భారత్ 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా ఇండియా-ఏ, యూఏఈలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, జితేశ్ శర్మ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. యూఏఈకి 298 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది (Ind A Vs UAE).
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఇక ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 42 బంతుల్లో 15 సిక్సులు, 11 ఫోర్లతో, 144 పరుగులు సాధించాడు. 17 బంతుల్లో అర్ధశకతం.. ఆ తరువాత 15 బంతుల్లో శతకాన్ని సాధించి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక కెప్టెన్ జితేశ్ శర్మ కూడా వైభవ్ సూర్యవంశీకి తోడుగా నిలవడంతో పరుగుల వరద పారింది. జితేశ్ శర్మ 32 బంతుల్లో 83 పరుగులు (6 సిక్సులు, 8 ఫోర్లు) రాబట్టి అజేయంగా నిలిచాడు. 24 బంతుల్లో వేగవంతమైన అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు నమన్ ధీర్ కూడా 34 పరుగులు రాబట్టి ఫరవాలేదనిపించాడు. యూఏఈ బౌలర్లు ఫరాజుద్దీన్, అయాన్ అఫ్జల్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ చెరో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు గుడ్‌న్యూస్
ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి