దక్షిణాఫ్రికా ఘనవిజయం
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:18 AM
దక్షిణాఫ్రికా ఖాతాలో మరో ఘనవిజయం చేరింది. బ్యాటింగ్‌లో శతకం బాదిన కార్బిన్ బాష్ బౌలింగ్‌లోనూ చెలరేగి ఐదు వికెట్లతో...
బులవాయో: దక్షిణాఫ్రికా ఖాతాలో మరో ఘనవిజయం చేరింది. బ్యాటింగ్‌లో శతకం బాదిన కార్బిన్ బాష్ బౌలింగ్‌లోనూ చెలరేగి ఐదు వికెట్లతో రాణించాడు. దీంతో జింబాబ్వేతో నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో సఫారీలు 328 పరుగుల తేడాతో గెలుపొందారు. 537 పరుగుల భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 418/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేయగా.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు పరిమితమైంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి