గంగూలీ సోదరుడికి తప్పిన ప్రాణాపాయం
ABN , Publish Date - May 27 , 2025 | 02:14 AM
బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ, అతడి భార్య అర్పితలకు సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి...
పూరీ: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ, అతడి భార్య అర్పితలకు సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అన్న అయిన స్నేహశీష్.. భార్యతో కలిసి గత శనివారం ఒడిషాలోని పూరీకి విహారయాత్రకు వెళ్లాడు. అక్కడి సముద్ర తీరంలో బోటింగ్ చేస్తుండగా భారీ అలల కారణంగా వీరి స్పీడ్ బోట్ బోల్తా పడింది. దీంతో ఈ దంపతులను గమనించిన అక్కడి ఫిషర్‌మెన్, లైఫ్‌గార్డ్స్ వెంటనే వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఇది తమకు రెండో జీవితం లాంటిదని, ఆ జగన్నాథుడే కాపాడినట్టు స్నేహాశిష్ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా మొదటి భార్యకు విడాకులిచ్చిన స్నేహశీష్ (60) గతేడాది జులైలో అర్పితను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి