Share News

Smriti Mandhana: పెళ్లి వేడుకల ఫొటోలు తొలగించిన స్మృతి

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:06 AM

తండ్రి శ్రీనివాస్‌ అస్వస్థతకు గురవడంతో టీమిండియా క్రికెటర్‌ స్మృతీ మంధాన.. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో వివాహాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. అయితే, ఇప్పుడు స్మృతి...

Smriti Mandhana: పెళ్లి వేడుకల ఫొటోలు తొలగించిన స్మృతి

ముంబై: తండ్రి శ్రీనివాస్‌ అస్వస్థతకు గురవడంతో టీమిండియా క్రికెటర్‌ స్మృతీ మంధాన.. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో వివాహాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. అయితే, ఇప్పుడు స్మృతి తన పెళ్లి ముందస్తు వేడుకలకు సంబంధించిన అన్ని ఫొటోలను సోషల్‌ మీడియా ఖాతా నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. రెండ్రోజుల క్రితం డీవై పాటిల్‌ స్టేడియంలో పలాష్‌ రింగ్‌ తొడిగి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీడియో కూడా స్మృతి ఖాతా నుంచి మాయమైంది. అంతేకాదు.. హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన సహచర క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్‌, శ్రేయాంక పాటిల్‌ తదితరులు కూడా తమ సోషల్‌ మీడియా నుంచి ఫొటోలను తొలగించడం గమనార్హం. దీంతో ఏం జరిగిందోనంటూ అనేకమంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫొటోలు, వీడియోలను స్మృతి కావాలనే తొలగించిందా లేదంటే హైడ్‌లో ఉంచిందా? అంటూ చర్చించుకుంటున్నారు. మరోవైపు స్మృతి కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ కూడా ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.

ఇవి కూడా చదవండి:

కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్

టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!

Updated Date - Nov 25 , 2025 | 03:06 AM