Kabaddi WC: కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్
ABN , Publish Date - Nov 24 , 2025 | 07:18 PM
భారత మహిళలు ప్రపంచ వేదికలపై అదరగొడుతున్నారు. తాజాగా భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 35-28 తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆట ఏదైనా.. ప్రపంచ వేదికలపై అమ్మాయిలు అదరగొడుతున్నారు. భారత మహిళలు మరో ప్రపంచకప్ అందుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది.
చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా కబడ్డీ జట్టు 35-28 తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్స్ చేరిన భారత్.. అక్కడ ఇరాన్‌పై 33-21 తేడాతో విజయం సాధించింది. అజేయంగా ఫైనల్ చేరి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. రీతూ నేకి కెప్టెన్సీలో భారత మహిళా కబడ్డీ టీమ్ రికార్డు సృష్టించింది. ఈ జట్టులో ఐదుగురు హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన వారే కావడం విశేషం.
వరుసగా...
ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడారు. ఆ సంబరాలు ఇంకా ముగియక ముందే అంధుల విభాగంలో అమ్మాయిలు టీ20 ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ అందుకుంది.
ఇవి కూడా చదవండి:
ఆ పోస్టులు డిలీట్ చేసిన స్మృతి!