Share News

Laura Wolvaardt: మంధానను దాటేసి

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:36 AM

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన వన్డేల్లో నెంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయింది. గతవారం ముగిసిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల (571)తో రికార్డు...

Laura Wolvaardt: మంధానను దాటేసి

దుబాయ్‌: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన వన్డేల్లో నెంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయింది. గతవారం ముగిసిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల (571)తో రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ప్రపంచకప్‌ బ్యాటర్ల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకిన వోల్వార్ట్‌.. 814 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మంధాన (811) రెండో ర్యాంక్‌కు పడిపోయింది. వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో సూపర్‌ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా యువ కెరటం జెమీమా రోడ్రిగ్స్‌ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి పదో ర్యాంక్‌తో టాప్‌-10లో నిలిచింది. సారథి హర్మన్‌ప్రీత్‌ 14వ స్థానంలో ఉంది. బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్‌ టాప్‌లో ఉండగా, భారత్‌కు చెందిన దీప్తీ శర్మ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Updated Date - Nov 05 , 2025 | 05:36 AM