Siraj :ast Wicket In Oval : సుయ్ సెలబ్రేషన్స్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:13 AM
ఇంగ్లండ్‌తో టెస్టులో చివరి వికెట్ తీసిన అనంతరం సిరాజ్.. రెండు చేతులూ వెనక్కినెట్టి గట్టిగా అరుస్తూ సింహనాదం చేశాడు. దీన్ని ‘సుయ్’ సెలబ్రేషన్స్ అంటారు. సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇదే రీతిన...
ఇంగ్లండ్‌తో టెస్టులో చివరి వికెట్ తీసిన అనంతరం సిరాజ్.. రెండు చేతులూ వెనక్కినెట్టి గట్టిగా అరుస్తూ సింహనాదం చేశాడు. దీన్ని ‘సుయ్’ సెలబ్రేషన్స్ అంటారు. సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇదే రీతిన సెలబ్రేట్ చేసుకుంటాడు. 2013లో ఓ మ్యాచ్‌లో గోల్ కొట్టినప్పుడు రొనాల్డో తొలిసారిగా ఈ విన్యాసాన్ని ప్రదర్శించాడు. సుయ్ అనేది పోర్చుగీసు పదం. దీనికి అవును అనే అర్థం. ‘అవును.. నేను ప్రత్యర్థిని పడగొట్టా’ అనే అర్థం వచ్చేలా ఈ విన్యాసాన్ని ఆటగాళ్లు ప్రదర్శిస్తుంటారు.
సిరాజ్‌లాంటి బౌలర్ ఉంటే..
సిరాజ్, ప్రసిద్ధ్‌లాంటి బౌలర్లుంటే కెప్టెన్సీ చేయడం తేలికవుతుంది. ఆఖరి రోజు మా ప్రదర్శపై పూర్తి సంతృప్తిగా ఉన్నా. నిజానికి ఇరు జట్లు గ్రేడ్ ‘ఎ’ క్రికెట్ ఆడాయి. మేం గెలుస్తామన్న నమ్మకం నాలుగో రోజే కలిగింది. ఎందుకంటే ఒత్తిడి ఉన్నది వారిపైనే. కెప్టెన్ గిల్
పదికి పది: సచిన్
టెస్టు క్రికెట్.. ఎప్పుడూ ఉత్కంఠ రేపుతుంది. సిరీస్ 2-2తో సమం చేసిన కుర్రాళ్ల ప్రదర్శనకు పదికి పది మార్కులు.
పోరాటం అద్భుతం: కోహ్లీ
టీమిండియాకు గొప్ప విజయం. సిరాజ్, ప్రసిద్ధ్ పోరాటం, పట్టుదల జట్టుకు చిరస్మరణీయ గెలుపును అందించింది. సిరాజ్ జట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News