Share News

ప్రీ క్వార్టర్స్‌కు సింధు ప్రణయ్‌

ABN , Publish Date - May 28 , 2025 | 05:09 AM

భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సింధు 21-14, 21-9తో వెన్‌ యు జాంగ్‌ (కెనడా)పై నెగ్గింది....

ప్రీ క్వార్టర్స్‌కు సింధు ప్రణయ్‌

సింగపూర్‌: భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సింధు 21-14, 21-9తో వెన్‌ యు జాంగ్‌ (కెనడా)పై నెగ్గింది. మాళవిక 21-14, 18-21, 11-21తో సుపనిదా కొటగొంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, అన్‌మోల్‌ కర్బ్‌ 11-21, 22-24తో చెన్‌ యు ఫీ (చైనా) చేతిలో ఓడారు. ప్రణయ్‌ 19-21, 21-16, 21-14తో రాస్మస్‌ జమ్మే (డెన్మార్క్‌)పై నెగ్గగా.. కిరణ్‌ జార్జ్‌ 19-21, 17-21తో వెంగ్‌ హోంగ్‌ యాంగ్‌ (చైనా) చేతిలో, ప్రియాన్షు 21-14, 10-21, 14-21తో కొడాయ్‌ నరోకా (జపాన్‌) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో కవిప్రియ-సిమ్రన్‌ జంట 4-21, 9-21తో కొరియా జోడీ లి సొ హి-బెక్‌ హ న (కొరియా) చేతిలో, మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా ద్వయం 18-21, 13-21తో చైనా జంట జియాంగ్‌-జాంగ్‌ చి చేతిలో, సూర్య-అమృత ద్వయం 11-21, 17-21తో జపాన్‌ జంట యుచి షిమోగమి-సయాక చేతిలో ఓడారు.

ఇవీ చదవండి:

టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!

బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:09 AM