National Senior Badminton Championship: ఫైనల్లో సింధు బృందం
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:42 AM
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఇక్కడి చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లు...
ఘనంగా ప్రారంభమైన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు
విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఇక్కడి చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ పోటీపడుతున్న ఈ టోర్నీలో తొలి రోజు టీమ్ విభాగంలో మ్యాచ్‌లు నిర్వహించారు. ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు మహిళల టీమ్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సింధు సారథ్యంలోని ఏపీ జట్టు సెమీఫైనల్లో గుజరాత్‌ను ఓడించింది. పురుషుల టీమ్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నేతృత్వంలోని ఏపీ జట్టు క్వార్టర్‌ఫైనల్లో తమిళనాడు చేతిలో ఓటమిపాలైంది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ ఎండీ భరణి, శాప్ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్