Share News

Sindhu Earns Spot in BWF Athletes: సింధు మూడోసారి

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:37 AM

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్ల కమిషన్‌లో...

Sindhu Earns Spot in BWF Athletes: సింధు మూడోసారి

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌లో చోటు

న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్ల కమిషన్‌లో మూడోసారి చోటు దక్కించుకుంది. నవంబరు 2025-నవంబరు 2029 కాలానికిగాను బీడబ్ల్యూఎఫ్‌ శుక్రవారం ప్రకటించిన నూతన సభ్యుల జాబితాలో మరోసారి సింధు పేరును చేర్చారు. తొలిసారిగా 2017లో ఈ కమిషన్‌కు ఎంపికైన సింధు.. ఆ తర్వాత 2021లో రెండోసారి స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 05:37 AM