Share News

ఒకుహరపై సింధు గెలుపు

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:37 AM

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పీవీ సింధు, డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి శుభారంభం చేశారు. కాగా, వెటరన్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, మరో స్టార్‌ ఆటగాడు...

ఒకుహరపై సింధు గెలుపు

  • సాత్విక్‌ జోడీ ముందంజ

  • ప్రణయ్‌, లక్ష్య అవుట్‌

ఇండోనేసియా ఓపెన్‌

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పీవీ సింధు, డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి శుభారంభం చేశారు. కాగా, వెటరన్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, మరో స్టార్‌ ఆటగాడు లక్ష్య సేన్‌ మాత్రం ఆరంభంలోనే ఇంటిబాట పట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 22-20, 21-23, 21-15తో చిరకాల ప్రత్యర్థి, జపాన్‌ స్టార్‌ నొజొమి ఒకుహరపై పోరాడి గెలిచింది. సింధు రెండోరౌండ్లో ఆరోసీడ్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడనుంది. డబుల్స్‌ మొదటి రౌండ్లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 18-21, 21-18, 21-14తో స్థానిక ద్వయం లియో రోలీ కర్నాడో/మౌలానాను ఓడించి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఇక లక్ష్య సేన్‌ 11-21, 22-20, 15-21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యు కి (చైనా) చేతిలో, ప్రణయ్‌ 17-21, 18-21తో స్థానిక షట్లర్‌ ఫర్హాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 04:37 AM