Shubman Gill Injury: ఆస్పత్రిలో గిల్
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:22 AM
భారత కెప్టెన్ గిల్ తొలి టెస్టు మిగిలిన ఆటలో బరిలోకి దిగేది సందేహంగా మారింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 3 బంతులనే ఎదుర్కొన్న గిల్ మెడనొప్పితో మైదానం వీడాడు...
భారత కెప్టెన్ గిల్ తొలి టెస్టు మిగిలిన ఆటలో బరిలోకి దిగేది సందేహంగా మారింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 3 బంతులనే ఎదుర్కొన్న గిల్ మెడనొప్పితో మైదానం వీడాడు. హార్మర్ ఓవర్‌లో గిల్ స్లాగ్ స్వీప్ షాట్‌తో బౌండరీ సాధించాడు. కానీ వెంటనే మెడ పట్టేయడంతో తల తిప్పలేకపోయాడు. ఫిజియో వచ్చి పరిశీలించినా నొప్పి తగ్గకపోవడంతో గిల్ క్రీజు వీడాడు. కొన్ని గంటల తర్వాత మెడకు పట్టీతో కనిపించిన గిల్‌ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి