Share News

Shubman Gill Injury: గిల్‌కు గాయం చివరి మ్యాచ్‌కు దూరం

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:16 AM

పేలవ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా అతడి పాదానికి గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో అహ్మదాబాద్‌లో జరిగే ఐదో టీ20లో అతడు...

Shubman Gill Injury: గిల్‌కు గాయం చివరి మ్యాచ్‌కు దూరం

పేలవ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా అతడి పాదానికి గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో అహ్మదాబాద్‌లో జరిగే ఐదో టీ20లో అతడు ఆడేది అనుమానమే. నాలుగో టీ20 వేదికైన లఖ్‌నవూలో ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి కాలికి గాయమైనట్టు సమాచారం. ఆ మ్యాచ్‌ రద్దు కావడంతో అతడి గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. జట్టు వామప్‌ సమయంలో కూడా గిల్‌ కనిపించలేదు. ‘నాలుగో టీ20 నేపథ్యంలో గిల్‌ ఎక్కువసేపు సాధన చేశాడు. సెషన్‌ ఆఖర్లో నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా బంతి బలంగా తగిలింది. అతడు బాధతో అతడు విలవిల్లాడాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పొట్టి వరల్డ్‌కప్‌ ముందు భారత్‌కు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆఖరిది. ఈ సిరీ్‌సలో ఆడిన జట్టును వరల్డ్‌క్‌పనకు ఎంపిక చేసే చాన్సుంది. మరి.. అప్పటికల్లా గిల్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడా? లేదా? చూడాలి. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో మెడ పట్టేయడంతో రెండో టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌కు గిల్‌ దూరమయ్యాడు.

ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

Updated Date - Dec 18 , 2025 | 05:16 AM