Vijay Hazare Trophy: హజారే బరిలో గిల్, అభిషేక్, అర్ష్‌దీప్
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:33 AM
టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. తాజాగా ప్రకటించిన పంజాబ్ జట్టులో వీరికి చోటు దక్కింది....
ముంబై జట్టులో సూర్యకుమార్, శివమ్ దూబే
జార్ఖండ్ సారథిగా ఇషాన్ కిషన్
చండీగఢ్: టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. తాజాగా ప్రకటించిన పంజాబ్ జట్టులో వీరికి చోటు దక్కింది. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్‌కు స్థానం లభించగా.. గిల్‌పై వేటుపడిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో గిల్, పేసర్ అర్ష్‌దీప్ రెండు లేదా మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బుధవారం నుంచి విజయ్ హజారే జరగనుంది. ఇక, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముంబై తరఫున చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆడనున్నారు. యశస్వీ జైస్వాల్ కూడా ముంబై జట్టులో కొన్ని మ్యాచ్‌లు ఆడతాడని సమాచారం. మరోవైపు, టీ20 వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కించుకొన్న ఇషాన్ కిషన్.. హజారే టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జాతీయ జట్టు మ్యాచ్‌లు లేనప్పడు ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నీలో కచ్చితంగా ఆడాలని బీసీసీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా తమ జట్ల తరఫున ఈ టోర్నీ బరిలో నిలవనున్నారు.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్