Shreyas Iyer : సినిమా చూస్తుండగా.. ఫోనొచ్చింది
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:02 AM
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అనూహ్యంగా బరిలోకి దిగిన శ్రేయాస్ అదిరే ఆటతో ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టు

శ్రేయాస్ అయ్యర్
నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అనూహ్యంగా బరిలోకి దిగిన శ్రేయాస్ అదిరే ఆటతో ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యా డు. అయితే ఈ మ్యాచ్‌లో ఆడడం వెనుక ఓ ఆసక్తికర విషయాన్ని శ్రేయాస్ పంచుకున్నాడు. ‘తొలి వన్డేలో ఎలాగూ చోటు దక్కదని తెలుసుకాబట్టి మ్యాచ్‌కు ముందు రోజు నేను హాయిగా సినిమా చూస్తు న్నా. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ నుంచి ఫోనొచ్చింది. విరాట్‌కు మోకాలిలో వాపు వచ్చింది. నీకు మ్యాచ్ ఆడే అవకాశం రావచ్చు. సిద్ధంగా ఉండమని చెప్పాడు. అంతే.. వెంటనే నా గదికి వెళ్లి పడుకున్నా. అలా విరాట్ దూరం కావడంతోనే నాకు అవకాశం దక్కింది’ అని శ్రేయాస్ తెలిపాడు.
ఆశ్చర్యమే..: పాంటింగ్
చాలా రోజులుగా శ్రేయాస్ అయ్యర్‌ను సెలెక్టర్లు జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. గతేడాది ఆరంభం నుంచి వన్డేల్లో.. 2023 చివర నుంచి టీ20ల్లోనూ శ్రేయా్‌సకు భారత జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు శ్రేయా్‌సలాంటి సమర్థుడైన బ్యాటర్‌ను పక్కనబెట్టడం మానుకోవాలని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా సూచించాడు. వన్డే వరల్డ్‌క్‌పలో నాలుగో నెంబర్‌లో ఆడి 500+ పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా శ్రేయాస్ నిలిచిన విషయం మరువరాదని గుర్తుచేశాడు.
రెండో వన్డేలో కోహ్లీ ఆడతాడు
కోహ్లీ ఫిట్‌నె్‌సపై ఆందోళన అవసరం లేదని వైస్-కెప్టెన్ గిల్ స్పష్టంజేశాడు. మోకాలి వాపు నుం చి అతడు కోలుకున్నాడని, ఆదివారం కటక్‌లో జరిగే రెండో వన్డేలో ఆడతాడని ప్రకటించాడు.