National Bal Puraskar 2025: జాతీయ బాల పురస్కార్‌కు శివాని
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:39 AM
ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్‌కు ఆంధ్రప్రదేశ్ పారా అథ్లెట్ శివాని ఎంపికైంది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్‌కు ఆంధ్రప్రదేశ్ పారా అథ్లెట్ శివాని ఎంపికైంది. కర్నూలు జిల్లా, మద్దికెర గ్రామం శివాని స్వస్థలం. హైదరాబాద్‌లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో శివాని పారా అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లో గత నాలుగేళ్లగా శివాని కనబరుస్తున్న ప్రతిభ ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈనెల 26వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా శివాని ఈ పురస్కారాన్ని అందుకోనుంది.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్