Ondia Bowling Reshuffle: శార్దూల్ అన్షుల్ కష్టమే
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:47 AM
నాలుగో టెస్టులో విఫలమైన పేసర్లు శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్‌లపై వేటు పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో గురువారం నుంచి జరిగే ఐదో టెస్టులో భారత్ పటిష్ఠ జట్టుతో...
మాంచెస్టర్: నాలుగో టెస్టులో విఫలమైన పేసర్లు శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్‌లపై వేటు పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో గురువారం నుంచి జరిగే ఐదో టెస్టులో భారత్ పటిష్ఠ జట్టుతో బరిలోకి దిగాలనుకుంటోంది. ముఖ్యంగా బౌలింగ్ కూర్పుపై దృష్టిసారిస్తోంది. ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటర్లు ఉండాలనే ఉద్దేశంలో స్పెషలిస్ట్ బౌలర్ సేవలను కోల్పోవాల్సి వస్తోంది. 2014 తర్వాత ప్రత్యర్థికి 600+ పరుగులు సమర్పించుకున్న భారత్ ఈసారి ఎలాంటి తప్పూ చేయాలనుకోవడం లేదు. అన్షుల్ స్థానంలో ఆకాశ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ పోటీ పడనున్నారు. ఇక నాలుగో బౌలర్‌గా స్పిన్నర్ కుల్దీ్‌పను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు భారత జట్టు మాంచెస్టర్ నుంచి సోమవారం రైలులో లండన్‌కు చేరుకుంది. అలాగే నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి తమ ప్రాక్టీ్‌సను ఆరంభించనుంది.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..