Share News

India vs England 4th Test 2025: టీమిండియా అద్భుత పోరాటం

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:02 AM

బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌. దీనికి తోడు సున్నాకే రెండు వికెట్లు ఫట్‌. ఈనేపథ్యంలో టీమిండియా గెలుపు కాదు కదా.. కనీసం డ్రా కూడా అసాధ్యమేనేమో అనిపించింది. కానీ పోరాడితే పోయేదేముందనే కసితో బరిలోకి దిగిన టీమిండియా...

India vs England 4th Test 2025: టీమిండియా అద్భుత పోరాటం

311 పరుగుల లోటు.. ఐదు సెషన్ల ఆట.. అటు చూస్తే

  • శతక్కొట్టిన గిల్‌, జడేజా, సుందర్‌

  • రాహుల్‌ చేజారిన సెంచరీ

  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 425/4

  • ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు డ్రా

బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌. దీనికి తోడు సున్నాకే రెండు వికెట్లు ఫట్‌. ఈనేపథ్యంలో టీమిండియా గెలుపు కాదు కదా.. కనీసం డ్రా కూడా అసాధ్యమేనేమో అనిపించింది. కానీ పోరాడితే పోయేదేముందనే కసితో బరిలోకి దిగిన టీమిండియా అబ్బురపరిచింది. కెప్టెన్‌ గిల్‌ తన అసాధారణ ఆటతీరుతో సిరీ్‌సలో నాలుగో శతకం సాధించగా, రాహుల్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ సెంచరీ సమీపంలో నిలిచింది. ఇక జడేజా-సుందర్‌లు రెండు సెషన్ల పాటు నిలిచి అజేయ సెంచరీలతో ఓటమి నుంచి కాపాడారు. వీరి పోరాటంతో మ్యాచ్‌ గ్రేట్‌ ఎస్కేప్‌ రీతిలో చరిత్రాత్మక డ్రాగా ముగిసింది. దీంతో తమదే విజయమనే ధీమాలో ఉన్న ఇంగ్లండ్‌కు దిమ్మ తిరిగింది. ఈ అలుపెరుగని పోరాటంతో యువ కెప్టెన్‌ గిల్‌ ఆధ్వర్యంలోని నయా భారత్‌ను తక్కువ అంచనా వేయరాదని ప్రత్యర్థి జట్లకు చాటి చెప్పింది.

మాంచెస్టర్‌: ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటర్ల అసామాన్య పోరాటంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. దీంతో ఈనెల 31 నుంచి జరిగే ఐదో టెస్టులో నెగ్గి సిరీ్‌సను సమం చేయాలనుకుంటోంది. ప్రస్తుతం స్టోక్స్‌ సేన 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి రోజు ఆదివారం ఆటలో జడేజా (107 నాటౌట్‌), సుందర్‌ (101 నాటౌట్‌), కెప్టెన్‌ గిల్‌ (103) శతకాలతో హోరెత్తించారు. దాదాపు రోజంతా బ్యాటింగ్‌ సాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లలో 425/4 స్కోరుతో నిలిచింది. రాహుల్‌ (90) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా స్టోక్స్‌ నిలిచాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేశాయి.


014-sports.jpg

గిల్‌ శతక పోరాటం: 174/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. శనివారం క్రీజులో పాతుకుపోయి డ్రాపై ఆశలు రేపిన కెప్టెన్‌ గిల్‌, రాహుల్‌ ఏమేరకు పోరాడతారనే ఆసక్తి అంతటా వ్యక్తమైంది. అయితే తన క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ సెంచరీకి మరో 10 రన్స్‌ దూరంలోనే ఆగాడు. ఆట ఆరంభమైన కాసేపటికే అతడిని స్టోక్స్‌ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 421 బంతుల్లో 188 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఇక స్టోక్స్‌ తర్వాతి ఓవర్‌లో బంతి గిల్‌ కుడిచేతి బొటన వేలికి తాకి పైకి లేచి హెల్మెట్‌ను సైతం తాకడంతో బాధతో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించాక బ్యాటింగ్‌ సాగించాడు. నాలుగో రోజు బౌలింగ్‌కు దూరంగా ఉన్న స్టోక్స్‌ ఆదివారం మాత్రం భుజం నొప్పితోనే వరుసగా ఎనిమిది ఓవర్ల స్పెల్‌ వేసి బౌన్స్‌తో ఇబ్బందిపెట్టాడు. 90 పరుగులకు చేరాక నిదానం కనబర్చిన గిల్‌ మరో 10 రన్స్‌ కోసం 36 బంతులాడి శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ అప్పటికే కొత్త బంతి తీసుకున్న ఇంగ్లండ్‌ ఫలితం సాధించింది. సెషన్‌ ముగియడానికి రెండు ఓవర్ల ముందు గిల్‌ను ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. తర్వాతి బంతికే జడేజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రూట్‌ వదిలేశాడు. తొలి సెషన్‌లో కేవలం 49 పరుగులే రావడం గమనార్హం.

జడ్డూ-సుందర్‌ శతక భాగస్వామ్యం: 88 పరుగులు వెనుకబడిన దశలో రెండో సెషన్‌ను ఆరంభించిన భారత్‌కు జడేజా-సుందర్‌ అద్భుత భాగస్వామ్యంతో అండగా నిలిచారు. బౌలర్లను మార్చినా.. క్రీజుకు నలువైపులా ఫీల్డర్లను మోహరించినా... ఇంగ్లండ్‌ ఈ జోడీని విడదీయలేకపోయింది. పట్టు వదలకుండా ఒక్కో బంతిని జాగ్రత్తగా ఆడేస్తూ ప్రత్యర్థి బౌలర్లను విసిగించారు. స్పిన్నర్‌ డాసన్‌ కూడా ఈ ఇద్దరు లెఫ్ట్‌ హ్యాండర్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు. స్టోక్స్‌ ఓవర్‌లో 6,4తో సుందర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. అదే ఓవర్‌లో మరో ఫోర్‌తో జడేజా సైతం ఈ ఫీట్‌ అందుకున్నాడు. సెషన్‌ ముగిసేసరికి ఐదో వికెట్‌కు అజేయంగా వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేయడమే కాకుండా.. జట్టుకు 11 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. దీంతో డ్రాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆఖరి సెషన్‌లోనూ పరిస్థితి మారలేదు. బంతి కూడా పాతబడడంతో వీరి బ్యాటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 358

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 669

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రూట్‌ (బి) వోక్స్‌ 0, రాహుల్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 90, సుదర్శన్‌ (సి) బ్రూక్‌ (బి) వోక్స్‌ 0, గిల్‌ (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 103, సుందర్‌ (నాటౌట్‌) 101, జడేజా (నాటౌట్‌) 107, ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 143 ఓవర్లలో 425/4; వికెట్ల పతనం: 1-0, 2-0, 3-188, 4-222. బౌలింగ్‌: వోక్స్‌ 23-4-67-2, ఆర్చర్‌ 23-3-78-1, కార్స్‌ 17-3-44-0, డాసన్‌ 47-11-95-0, రూట్‌ 19-2-68-0, స్టోక్స్‌ 11-2-33-1, బ్రూక్‌ 3-0-24-0.

1

ఓ టెస్టు సిరీ్‌సలో ఎక్కువ శతకాలు (4) బాదిన కెప్టెన్‌గా బ్రాడ్‌మన్‌, గవాస్కర్‌ సరసన నిలిచిన గిల్‌. అయితే తొలిసారి కెప్టెన్‌గా బరిలోకి దిగి ఇన్ని సెంచరీలు సాధించిన రికార్డు మాత్రం గిల్‌దే. ఇక భారత్‌ తరఫున ఓ సిరీ్‌సలో నాలుగు సెంచరీలు సాధించి గవాస్కర్‌, విరాట్‌లతో సమంగా నిలిచాడు.

1

మూడు లేదా నాలుగో ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు నమోదు కావడం భారత్‌కిదే తొలిసారి. అలాగే ఓ టెస్టు సిరీ్‌సలో నలుగురు భారత బ్యాటర్లు (గిల్‌, పంత్‌, రాహుల్‌, జడేజా) 400+ పరుగులు సాధించడం కూడా ఇదే మొదటిసారి.

2

కెప్టెన్‌గా తొలి సిరీ్‌సలోనే ఎక్కువ పరుగులు (722) చేసిన రెండో బ్యాటర్‌గా గిల్‌. డాన్‌ బ్రాడ్‌మన్‌ (810) తొలి స్థానంలో ఉన్నాడు. అలాగే భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో బ్యాటర్‌ అయ్యాడు. గవాస్కర్‌ (774, 732) ముందున్నాడు.

1

టెస్టు సిరీ్‌సల్లో ఎక్కువ సార్లు (7) 350+ స్కోర్లు సాధించిన జట్టుగా భారత్‌.

ఇవి కూడా చదవండి..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 03:03 AM