Share News

స్వర్ణాల వేటలో షణ్ముఖి గణేశ్‌

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:08 AM

ఆసియా కప్‌ స్టేజ్‌-2లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్లు అదరగొడుతున్నారు. విజయవాడకు చెందిన షణ్ముఖి నాగసాయి బుద్దె మరో రెండు పతకాలు ఖరారు చేసుకోగా...

స్వర్ణాల వేటలో షణ్ముఖి గణేశ్‌

  • ఆసియా కప్‌ స్టేజ్‌-2 ఆర్చరీ

సింగపూర్‌: ఆసియా కప్‌ స్టేజ్‌-2లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్లు అదరగొడుతున్నారు. విజయవాడకు చెందిన షణ్ముఖి నాగసాయి బుద్దె మరో రెండు పతకాలు ఖరారు చేసుకోగా.. నాయుడుపేట ఆర్చర్‌ గణేశ్‌ మణిరత్నం తిరుమూరు టీమ్‌ స్వర్ణ పోరుకు చేరుకొంది. గురువారం మొత్తంగా ఐదు టీమ్‌ ఈవెంట్లలో భారత జూనియర్‌ ఆర్చర్లు ఫైనల్స్‌కు చేరుకొన్నారు. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ సెమీ్‌సలో షణ్ముఖి, తేజల్‌, తనిక్షతో కూడిన భారత జట్టు 230-229తో నాలుగో సీడ్‌ కజకిస్థాన్‌పై గెలిచింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌లో షణ్ముఖి-కుశాల్‌ జంట 155-154తో ఇండోనేసియా జంట నురిసా డియాన్‌ అష్రఫ్‌-ప్రిమా విష్ణు వర్దానపై నెగ్గి ఫైనల్‌కు చేరుకొంది. కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ సెమీ్‌సలో కుశాల్‌ దలాల్‌, గణేశ్‌ తిరుమూరు, మిహిర్‌ అపార్‌ల త్రయం షూటా్‌ఫలో ఆస్ట్రేలియాపై నెగ్గింది. విష్ణు చౌదరి, పరాజ్‌ హుడా, జుయెల్‌ సర్కార్‌లతో కూడిన పురుషుల రికర్వ్‌ టీమ్‌ 5-1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. స్వర్ణ పోరులో జపాన్‌తో భారత్‌ తలపడనుంది. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ సెమీ్‌సలో వైష్ణవి పవార్‌-విష్ణు చౌదరి జంట 5-3తో సింగపూర్‌ జోడీపై గెలిచింది.

ఇవి కూడా చదవండి:

బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన

టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 20 , 2025 | 05:08 AM