Share News

షమి.. చెత్త రికార్డు

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:01 AM

షమి ఓ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో సుదీర్ఘమైన ఓవర్‌ వేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. తొలి ఓవర్‌ బౌల్‌ చేసిన షమి.. మొత్తం 11 బంతులు వేయాల్సి వచ్చింది...

షమి.. చెత్త రికార్డు

షమి ఓ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో సుదీర్ఘమైన ఓవర్‌ వేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. తొలి ఓవర్‌ బౌల్‌ చేసిన షమి.. మొత్తం 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఐదు వైడ్లు వేసి ఆరు పరుగులిచ్చాడు. కాగా, 2000లో బంగ్లా బౌలర్‌ హసిబుల్‌ హుస్సేన్‌, 2004 టోర్నీలో జింబాబ్వే ఆటగాడు టినాషి పన్యాంగర ఓ ఓవర్‌లో 13 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకొన్నారు. సుదీర్ఘ ఓవర్‌ వేసిన తొలి భారత బౌలర్‌గా షమి నిలిచాడు. 2017 ఫైనల్లో బుమ్రా 9 బంతుల పేలవ రికార్డును షమి మరుగునపడేలా చేశాడు. కాగా, షమికి గాయం తిరగబెట్టిందా? అనే అనుమానం కలుగుతోంది. 5వ ఓవర్‌ బౌల్‌ చేస్తున్నప్పుడు అతడి కుడి కాలి చీలమండలో సమస్య తలెత్తింది. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత.. ఆ ఓవర్‌పూర్తి చేసి మైదానం వీడాడు. అయితే, మళ్లీ 12వ ఓవర్‌లో షమి బౌలింగ్‌కు దిగాడు. కానీ, కీలక మ్యాచ్‌లో మాత్రం అతడి రనప్‌ ఇబ్బందిగానే కనిపించింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 03:01 AM