Share News

షఫాలీకి చోటు

ABN , Publish Date - May 16 , 2025 | 05:45 AM

ఇంగ్లండ్‌లో ఆ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో తలపడే భారత మహిళా జట్లను గురువారం ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలలో తలపడనున్నాయి...

షఫాలీకి చోటు

అరుంధతి, శ్రీచరణి ఎంపిక

ఇంగ్లండ్‌లో భారత మహిళల టూర్‌

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో ఆ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో తలపడే భారత మహిళా జట్లను గురువారం ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలలో తలపడనున్నాయి. వచ్చే నెల 28న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగే మొదటి టీ20తో భారత్‌ పర్యటన ప్రారంభమవుతుంది. ఇక..రెండు జట్లకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతీ మంధాన వైస్‌-కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఏడు మాసాల విరామం తర్వాత ఓపెనర్‌ షఫాలీ వర్మకు జాతీ య జట్టులో చోటు దక్కింది. ఫామ్‌ కోల్పోయిన షఫాలీ గతేడాది అక్టోబరు తర్వాత బెర్త్‌ టీమిండియాలో దక్కించుకోలేకపోయింది. కాగా రెండు జట్లలో తెలుగు క్రికెటర్లు అరుంధతి రెడ్డి, శ్రీచరణి ఎంపికయ్యారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీ గెలిచిన భారత జట్టుకు అరుంధతి, శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌తో సిరీస్‌ షెడ్యూల్‌

జూన్‌ 28 : తొలి టీ20, ట్రెంట్‌బ్రిడ్జ్‌

జూలై 1 : రెండో టీ20, బ్రిస్టల్‌

జూలై 4 : మూడో టీ20, కెన్నింగ్టన్‌ ఓవల్‌

జూలై 9 : నాలుగో టీ20, ఓల్డ్‌ట్రాఫర్డ్‌

జూలై 12 : ఐదో టీ20, ఎడ్జ్‌బాస్టన్‌

జూలై 16 : మొదటి వన్డే, సౌతాంప్టన్‌

జూలై 19 : రెండో వన్డే, లార్డ్స్‌

జూలై 22 : మూడో వన్డే, చెస్టర్‌ లీ స్ట్రీట్‌.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:45 AM