Pakistan Ex Cricketer Controversy: బంతికి వేజ్‌లైన్ పూశారు
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:51 AM
ఇంగ్లండ్‌పై ఓవల్ టెస్ట్‌లో భారత జట్టు చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ మాజీ పేసర్ షబ్బీర్ అహ్మద్ అవాకులు చవాకులు పేలాడు. ‘80 ఓవర్ల తర్వాత కూడా ఆ బంతి కొత్తదానిలా మెరిసిందంటే...
టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ అక్కసు
కరాచీ: ఇంగ్లండ్‌పై ఓవల్ టెస్ట్‌లో భారత జట్టు చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ మాజీ పేసర్ షబ్బీర్ అహ్మద్ అవాకులు చవాకులు పేలాడు. ‘80 ఓవర్ల తర్వాత కూడా ఆ బంతి కొత్తదానిలా మెరిసిందంటే భారత ఆటగాళ్లు దానికి వేజ్‌లైన్ పూసి ఉంటారు. ఆ బంతిని అంపైర్లు ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి’ అని షబ్బీర్ అక్కసు వెళ్లగక్కాడు. అయితే షబ్బీర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుమానాస్పద బౌలింగ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన షబ్బీర్‌కు టీమిండియా గురించే మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News